స్త్రీకి స్వేచ్ఛ ఉంటేనే నిజమైన ప్రజాస్వామ్యం
ABN , First Publish Date - 2020-08-16T10:16:51+05:30 IST
సమాజంలో మహిళలకు తగిన స్వేచ్ఛ ఉండి, తమ భావాలను వెల్లడించగలిగినపుడే నిజమైన ప్రజాస్వామ్యం అ ని పలువురు వక్తలు పేర్కొన్నారు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల ఆధ్వర్యం లో ఆచార్య డాక్టర్ శ్రీపురం యజ్ఞశేఖర్ అధ్య

ఒంగోలు (కల్చరల్), ఆగస్టు 15: సమాజంలో మహిళలకు తగిన స్వేచ్ఛ ఉండి, తమ భావాలను వెల్లడించగలిగినపుడే నిజమైన ప్రజాస్వామ్యం అ ని పలువురు వక్తలు పేర్కొన్నారు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల ఆధ్వర్యం లో ఆచార్య డాక్టర్ శ్రీపురం యజ్ఞశేఖర్ అధ్యక్షతన శనివారం ‘ఆధునిక సా హిత్యంలో స్ర్తీవాద కవిత్వం’ అనే అంశంపై అంతర్జాల సదస్సు జరిగింది. దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్న ఈ సద స్సుకు ప్రత్యేక అతిథిగా నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషాధిక్య సమాజంలో నష్టపోయేది స్ర్తీలు మాత్రమే కాదని పురుషులు సైతం నష్టపోతారని అన్నారు. కార్యక్రమంలో స్ర్తీవాద రచయిత్రి ఓల్గా మహెజబీన్, పద్మావతి విశ్వవిద్యాలయం ఆచార్యులు కొలకలూరి మధుజ్యోతి, ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత సుసాన్, ద్రావిడ విశ్వవిద్యాలయం డాక్టర్ ఉదయ్‌కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు.