ఈ-కర్షక్‌ నమోదులో ఇక్కట్లు

ABN , First Publish Date - 2020-09-12T10:22:55+05:30 IST

రైతుల పండించే ప్రతి పంటను లెక్కకట్టి విపత్తులు సంభవించినప్పుడు వారికి నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ- కర్షక్‌

ఈ-కర్షక్‌ నమోదులో ఇక్కట్లు

రైతులను వెంటాడుతున్న వెబ్‌ల్యాండ్‌ సమస్య ఫ కౌలురైతుల నమోదుకు సీసీఆర్‌సీ కార్డుల లింకు


ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 11: రైతుల పండించే ప్రతి పంటను లెక్కకట్టి విపత్తులు సంభవించినప్పుడు వారికి నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఈ- కర్షక్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే పంటల నమోదును సవివరంగా నిక్షిప్తం చే యాలని ప్రభుత్వం సంకల్పించింది. ఏదైనా నష్టం జ రిగినప్పుడు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాలోకి జమ చేయడమే ఈ-కర్షక్‌ ప్రధాన ఉద్దేశ్యం. ఖరీఫ్‌ ఆలస్యంగా ప్రారంభమయినప్పటికీ జిల్లా వ్యవసాయాధికారుల కృషితో ఇప్పటికే 80 శాతం మేర నమోదు  పూర్తయింది.

 

కానీ ప్రభుత్వ నిబంధనలు కొన్ని క్షేత్ర స్థాయిలో రైతులను  ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా రె వెన్యూ దస్త్రాల్లో కీలకమైన వెబ్‌ల్యాండ్‌లో కొంతమంది రైతుల పొలాల వివరాలు లేవు. ఈ-కర్షక్‌లో నమోదు కావాలంటే వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలు  ఉండాలి. దీంతో కొంతమంది రైతుల పంట వివరాలు నమోదు చేయడానికి సాధ్యపడటం లేదు. దీంతో వారు తహ సీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని మండలాల్లో వెబ్‌ల్యాండ్‌ నవీకరణ పేరుతో కొత్త దర ఖాస్తులు స్వీకరించడం లేదని రైతులు ఆవేదన చెందు తున్నారు.


ఇది పూర్తిగా రెవెన్యూశాఖ పరిధిలోని అంశ మని, వెబ్‌ల్యాండ్‌లో వివరాలు ఉంటేనే నమోదు జరు గుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తమకు నష్టపరిహారం అందకుండా పోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. అలాగే చాలామంది భూయ జమానులు కౌలు చేసుకునే రైతులకు సీసీఆర్‌సీ కా ర్డులజారీకి సుముఖంగా లేరు. కానీ ఈ-కర్షక్‌లో న మోదు చేసుకోవాలంటే సీసీఆర్‌సీ కార్డు ఉండాలి. సా గు వేరేవాళ్లు చేస్తూ ఉంటూ ఈ-కర్షక్‌లో మాత్రం భూ యజమాని పేరే నమోదవుతుంది. దీనివల్ల అందే రా యితీలు, నష్టపరిహార మొత్తాలు కౌలుదారుకు బదిలీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సీసీఆర్‌సీతో సంబంధం లేకుండా తమను గుర్తించాలని కౌలు రై తులు అభ్యర్థిస్తున్నారు.


ఇప్పటికే 80 శాతం నమోదు

ఈ-కర్షక్‌ నమోదులో భాగంగా దాదాపు 3,50,000 ఎకరాలను ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కించారు. ఉద్యాన పంటలకు సంబంధించి కూడా 80వేల ఎకరాల దాకా నమోదుచేశారు. త్వరలోనే ఖరీఫ్‌లో సాగయిన అన్ని పంటల వివరాలను సేకరించి లక్ష్యాన్ని చేరుకుంటామ ని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉన్నా రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకుని ముందుకెళుతున్నామని వెల్ల  డించారు.

Updated Date - 2020-09-12T10:22:55+05:30 IST