మాగుంట సుబ్బరామరెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-02T05:16:06+05:30 IST

ఒంగో లు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగుంట సుబ్బ రామరెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళ వారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు.

మాగుంట సుబ్బరామరెడ్డికి ఘన నివాళి
సుబ్బరామరెడ్డి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంపీ మాగుంట తదితరులు

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 1 : ఒంగో లు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగుంట సుబ్బ రామరెడ్డి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళ వారం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రామనగర్‌లోని మా గుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీని వాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రా ఘవరెడ్డిలు సుబ్బరామరెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో మాగుంట అభిమానులు ఏర్పాటు చే సిన పలు కార్యక్రమాల్లో ఎంపీ శ్రీనివాసులురెడ్డి హాజరయ్యారు. నెల్లూరు బస్టాండు, రైల్వే స్టేష న్‌ రోడ్డు, అద్దంకి బస్టాండులోని సుబ్బరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. సూపర్‌బజారు మాజీ చైర్మన్‌ తాతా ప్రసా ద్‌ ఆధ్వర్యంలో గాంధీరోడ్డులో పేదలకు ఎంపీ మాగుంట దుప్పట్లు పంపిణీ చేశారు. అనంత రం పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగి న సంతాపసభకు జిల్లా నలుమూలల ప్రజాప్ర తినిధులు, పలువురు ప్రముఖులు, వివిధ వర్గా ల ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా ర చయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు ఆధ్వర్యంలో కవిసమ్మేళనం నిర్వ హించారు. కాగా మాగుంట సుబ్బరామరెడ్డికి ఎ స్పీ సిద్ధార్థకౌశల్‌,  ఎమ్మెల్సీ పోతుల సునీత,  మాజీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కసుకుర్తి అదెన్న, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానరెడ్డి, టీడీపీ రైతు విభాగం రా ష్ట్ర అధ్యక్షుడు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, మేదర మెట్ల శంకరరెడ్డి, పోతుల కృష్ణారావు, డాక్టర్‌ గౌతంరెడ్డి, తాతా ప్రసాద్‌, ఘనశ్యాం, ఆత్మకూరి బ్రహ్మయ్య ఘనంగా నివాళులర్పించారు. 


Updated Date - 2020-12-02T05:16:06+05:30 IST