కౌన్సెలింగ్‌ పేరుతో.. కాఠిన్యం

ABN , First Publish Date - 2020-03-15T11:10:20+05:30 IST

స్థానిక ఎన్నికలు మళ్లీ ఆ గ్రామ ప్రజల్లో అలజడిని రేపుతున్నాయి. కాకుంటే అది వారి మధ్య వివాదాలతో కాదు..

కౌన్సెలింగ్‌ పేరుతో.. కాఠిన్యం

వేమవరంలో అలజడి 

ఇప్పటికే మూడే ళ్లుగా నిర్మానుష్యం

పోలీసుల తీరుతో మరింత భయాందోళనలు 

వణికిపోతున్న గ్రామస్థులు


బల్లికురవ/అద్దంకి, మార్చి 14: స్థానిక ఎన్నికలు మళ్లీ ఆ గ్రామ ప్రజల్లో అలజడిని రేపుతున్నాయి. కాకుంటే అది వారి మధ్య వివాదాలతో కాదు.. పోలీసుల  వ్యవహార శైలితోనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సెలింగ్‌ పేరుతో చితకబాదుతుండటంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. ఎప్పుడు స్టేషన్‌ పిలుస్తారోనని భయపడుతున్నారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ వర్గీయులే లక్ష్యం గా పోటీ నుంచి తప్పుకోవాలంటూ ఒత్తిడి చేస్తూ బెదిరించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చే స్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

 

మూడేళ్ల క్రితం వేమవరంలో జరిగిన జంట హత్య లతో గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. అ ప్పట్లో ఇరు వర్గీయులు టీడీపీలో ఉండగా కరణం బ లరాం అనుచరులపై గొట్టిపాటి వర్గీయులు దాడిచే యటంతో గోరంట్ల అంజయ్య, యోగినేని రామకో టేశ్వరరావులు మృతిచెందారు. మరికొందరికి గాయా లు కాగా చికిత్సపొందారు. అనంతరం వేమవరం జంటహత్యల కేసులో నిందితులు 2017 నవంబరు 3న అద్దంకి కోర్టుకు హాజరయ్యేందుకు ప్రత్యేక వా హనంలో వస్తుండగా అద్దంకి మండలం జార్లపాలెం సమీపంలో వారిపై హత్యాయత్నం జరిగింది.


అయితే అప్రమత్తంగా ఉండటం, పోలీసులు తక్షణమే స్పందించటంతో వారంతా బయటపడ్డారు. దీంతో వేమవరంలోని హత్యకేసులోని 13 మంది నిందితుల కుటుంబాలతో పాటు మరో 15 కుటుంబాలు గ్రామం విడిచిపోయి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. 30 కు టుంబాల ఇళ్ళు సుమారు మూడేళ్ళుగా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో గ్రామంలో నిశబ్ద వాతావరణం నెల కొంది. సుదీర్ఘకాలం పాటు వేమవరంలో పోలీస్‌ పికె ట్‌ కొనసాగింది. 


స్థానిక ఎన్నికల్లో పోటీతో..

స్థానిక ఎన్నికల నేపథ్యం లో ఇరు వర్గీయులు ఎంపీ టీసీలకు నామినేషన్లు వేశా రు. అప్పట్లో ఇరు వర్గీయులు తెలుగుదేశం పార్టీలోనే రెండు వ ర్గాలుగా ఉండగా అనంతరం మారి న పరిస్థితుల్లో కరణం వర్గీయులు వైసీపీకి దగ్గరయ్యారు. స్థానిక సంస్థల ఎ న్నికలకు ఇరు వర్గీయులు సిద్ధమై నామినేషన్‌లు వేశారు. ఎంపీటీసీ ఎన్నికలను ఇరువర్గీయులు ప్రతి ష్ఠాత్మకంగా తీసుకుంటారనుకుంటున్న ఉద్దేశంతో పో లీసులు ఇరువర్గీయులకు కౌన్సెలింగ్‌ నిర్వహిం చేందుకు సిద్ధమయ్యారు. 


ఈ నేపఽథ్యంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్‌ ల ఉపసంహరణ గడువు ముగిసే సమయంలో టీడీపీ వర్గీయులుగా ఉండి, అప్పటి హత్యకేసులో నిందితు లుగా ఉన్న 13 మందితో పాటు మరో ఇద్దరిని శు క్రవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సె లింగ్‌ నిర్వహించారు. అయితే, కౌన్సెలింగ్‌ నిర్వహించే సమయంలో పోలీసులు శ్రుతి మించి వ్యవహరించటం, దానిపై ఎమ్మెల్యే సీరియస్‌ అవ్వడం తెలిసిందే. అదే సమ యంలో గాయాలయ్యే విధంగా కాఠిన్యం ప్రదర్శించటం పట్ల తెలుగు దేశం వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తు న్నారు. అదే సమ యంలో ఎన్ని కలకు దూరంగా ఉండా లన్న సంకేతాలు ఇచ్చే విధంగా పోలీసులు వ్యవ హరించారని బాధితులు వాపోతున్నారు.
Updated Date - 2020-03-15T11:10:20+05:30 IST