పెళ్లి చేసుకుంటానని నమ్మించి... ఆతర్వాత..

ABN , First Publish Date - 2020-12-20T05:39:27+05:30 IST

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కందుకూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మహిళా సంఘం నాయకులు బాధితురాలితో కలిసి శనివారం నిరసన చేపట్టారు. బాధితురాలి కథనం మేరకు..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి... ఆతర్వాత..
సునీత కుమారికి న్యాయం చేయాలని నిరసన తెలుపుతున్న ఏపీ మహిళా సంఘం ప్రతినిధులు

ప్రేమ పేరుతో మోసం

 ఉద్యోగం రావడంతో ముఖం చాటేసిన యువకుడు 

బాధితురాలికి న్యాయం చేయాలంటూ 

 మహిళా సంఘాల నిరసన


కందుకూరు, డిసెంబరు 19 : ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కందుకూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట మహిళా సంఘం నాయకులు బాధితురాలితో కలిసి శనివారం నిరసన చేపట్టారు. బాధితురాలి కథనం మేరకు.. వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన లింగాబత్తిన సునీతకుమారిని, అదే కాలనీకి చెందిన కిరణ్‌కుమార్‌ గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగతీసుకొన్నాడు. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకోనని ముఖం చాటేశాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కిరణ్‌కుమార్‌పై పోలీసు కేసు నమోదు అయింది. నెలలు గడుస్తున్నా పోలీసులు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఏపీ మహిళా సంఘం నాయకుల ఆధ్వర్యంలో నిరసన   చేపట్టారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ రావమ్మ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పీ మాలకొండయ్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బీ సురేష్‌ బాబు, బాలకోటయ్య, ఆనందమోహన్‌, హుస్సేన్‌, లక్ష్మీ, సుభాన్‌, బడేవారిపాలెం గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T05:39:27+05:30 IST