రేపటి వరకు బదిలీల ఆప్షన్ గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-17T05:40:52+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీల ఆప్షన్ల గడువును ఈనెల 18వరకు ప్రభుత్వం పొడిగించిందని డీఈవో వీఎస్.సుబ్బారావు బుధ వారం తెలిపారు.

ఒంగోలువిద్య, డిసెంబరు16 : ఉపాధ్యాయుల బదిలీల ఆప్షన్ల గడువును ఈనెల 18వరకు ప్రభుత్వం పొడిగించిందని డీఈవో వీఎస్.సుబ్బారావు బుధ వారం తెలిపారు. జిల్లాలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారిలో 91శాతం మంది తమ ఆప్షన్లను అప్‌లోడ్ చేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 5624 మంది బదిలీలకు దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు 4947 మంది ఆప్షన్లు ఇచ్చారు. తప్పనిసరిగా 1880 మంది బ దిలీ కావాల్సి ఉండగా వీరిలో 1706 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇంకా 174 మంది మాత్రమే ఆప్షన్లు సమర్పించాల్సి ఉంది. అదేవిధంగా అభ్యర్థనమేరకు బదిలీల లో కోసం దరఖాస్తు చేసిన వారిలో ఇప్పటి వరకు 86.5శాతం మంది ఆప్షన్లు సమర్పించారు. జిల్లాలో మొత్తం 3744 మంది అభ్యర్థన మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 3241 మంది తమ ఆప్షన్లను అప్‌లోడ్ చేయగా కే వలం 503 మంది మాత్రమే బదిలీకోసం నచ్చిన స్థానాలకు వెబ్ ఆప్షన్లు స మర్పించాల్సి ఉంది. సర్వర్ సమస్య వల్ల సెంకడరీ గ్రేడ్ టీచర్ల ఆప్షన్లకు గం టల సమయం పడుతుంది. ఈ పరిస్థితులు గమనించి ఆప్షన్లు నమోదు గడు వును ప్రభుత్వం రెండు రోజులు పొడిగించింది.