-
-
Home » Andhra Pradesh » Prakasam » TRACTOR FELL younger dead
-
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-12-16T04:04:20+05:30 IST
ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన కారంచే డు మండలం పోతినవారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది.

పోతినవారిపాలెం(పర్చూరు), డిసెంబరు 15 : ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంఘటన కారంచే డు మండలం పోతినవారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాయుడు సుధీర్(20) ట్రాక్టర్‌పై దగ్గుబాడు వెళ్లి వస్తుండగా పోతినవారిపాలెం మ లుపు వద్ద ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. సుధీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పోతినవారిపాలెం వెళ్లి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.