నేడు వన సమారాధనలు

ABN , First Publish Date - 2020-12-13T06:24:44+05:30 IST

నేడు ఎర్రగొండపాలెంలోని షీలా స్కూల్‌ ఆవరణలో ఆదివారం ఉదయం కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన నిర్వహిస్తున్నట్లు కాకతీయ కమ్మ సేవా సమితి ఎర్రగొండపాలెం కమిటీ సభ్యులు శనివారం తెలిపారు.

నేడు వన సమారాధనలు


ఎర్రగొండపాలెం, డిసెంబరు 12 : నేడు ఎర్రగొండపాలెంలోని షీలా స్కూల్‌ ఆవరణలో ఆదివారం ఉదయం కాకతీయ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన నిర్వహిస్తున్నట్లు కాకతీయ కమ్మ సేవా సమితి ఎర్రగొండపాలెం కమిటీ  సభ్యులు శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారం భం అవుతాయని తెలిపారు. నియోజకవర్గంలోని కమ్మ  సమాజిక వర్గం వారు కుటుంబ సమేతంగా పాల్గొనాలని పేర్కొన్నారు.

ఎర్రగొండపాలెం : నేడు ఎర్రగొండపాలెంలోని మిల్లంపల్లి వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణలో  ఆదివారం ఉదయం రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన సమరాధన నిర్వహిస్తున్నట్లు రెడ్డి సేవా సమితి ఎర్రగొండపాలెం కమిటీ అధ్యక్షుడు కె. ఓబుల్‌రెడ్డి శనివారం తెలిపారు.ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తెలిపారు.


Updated Date - 2020-12-13T06:24:44+05:30 IST