నేడు లోకేష్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-12-29T05:03:48+05:30 IST

నివర్‌ తుఫానుకు నష్ట పోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళవారం పర్యటించనున్నారు.

నేడు లోకేష్‌ పర్యటన
పాడైపోయిన మిర్చిని పరిశీలిస్తున్న బాలాజీ

రూట్‌ మాప్‌లో నూకసాని పర్యటన

త్రిపురాంతకం, డిసెంబరు 28 : నివర్‌ తుఫానుకు నష్ట పోయిన పంటలను పరిశీలించి, రైతులను పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మంగళవారం పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రూట్‌ మ్యాప్‌ పరిశీలించేందుకు ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి కరిముల్లా సోమవారం మేడపిలో మిర్చి కల్లాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివర్‌ తుఫాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆ సమయంలో వ్యవసాయశాఖ ద్వారా ఈ-క్రాప్‌ నమోదు చేసినా, ప్రభుత్వం ఇన్సూరెన్సు కట్టకపోడంతో రైతులు బీమా పరిహారాన్ని పొందలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. దిగుబడులు కూడా సగానికిపైగా పడిపోయాయని, ధరలు ఐదో భాగానికి దిగిపోయాయని అన్నారు. వెనుకబడిన ప్రాంత రైతులను ఆదుకోవాలని మంత్రి సురే్‌షను కోరుతున్నానని అన్నారు. దీనికోసమే రైతులను పరామర్శించేందుకు లోకేష్‌ వస్తున్నారని తెలిపారు. లోకేష్‌ మంగళవారం 10 గంటలకు మేడపి, అనంతరం దోర్నాల, యడవల్లి గ్రామాలలో పర్యటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఊట్ల సీతారామయ్య, వై.పాలెం మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, పెద్దారవీడు మండల కన్వీనర్‌ వెన్నా వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:03:48+05:30 IST