-
-
Home » Andhra Pradesh » Prakasam » today cpi agetation in ongole
-
నేడు కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా
ABN , First Publish Date - 2020-12-07T05:07:29+05:30 IST
టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారుల కు అందజేయడంతో పాటు ఈనెల 25వ తేదీన ప్రభుత్వం పేదలకు ఇచ్చే పట్టాలను అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక క లెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు.

హాజరుకానున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఒంగోలు(కలెక్టరేట్), డిసెంబరు 6 : టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారుల కు అందజేయడంతో పాటు ఈనెల 25వ తేదీన ప్రభుత్వం పేదలకు ఇచ్చే పట్టాలను అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక క లెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకు రాష్ట్ర కార్యదర్శి కె,రామకృష్ణ హాజరుకానున్నడంతో పార్టీ నా యకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల టిడ్కో ఇళ్ళ కోసం పోరాటం చేస్తున్న సీపీ ఐ తదనుగుణంగా లబ్ధిదారులకు వెంటనే ఇళ్ళు పూ ర్తి చేసి ఇవ్వాలని, పేద లకు పట్టణ ప్రాంతాల్లో రెండుసెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని తదితర డిమా ండ్లతో ఈ ధర్నా చేపట్టారు.