తాళం వేసిన ఇళ్లే టార్గెట్
ABN , First Publish Date - 2020-02-08T11:04:35+05:30 IST
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడే తమిళనాడుకు చెందిన ముగ్గురు అంతర్రాష్ట దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.

ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
రూ. 2లక్షల సొత్తు స్వాధీనం
గిద్దలూరు, ఫిబ్రవరి 7 : తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడే తమిళనాడుకు చెందిన ముగ్గురు అంతర్రాష్ట దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారు గిద్దలూరు పట్టణంలోని రెండు గృహాల్లో చోరీచేసిన సొత్తుతోపాటు రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఈ ముఠా నాయకుడి కోసం గాలిస్తున్నారు. స్థానిక పో లీసు స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మార్కాపురం డీఎస్పీ నాగే శ్వరరెడ్డి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. త మిళనాడు రాష్ట్రంలోని కొట్టివాక్కం గ్రామానికి చెందిన మహాలింగం అశోక్‌కుమార్, మహాలింగం కార్తీక్, మ హాలింగం రమేష్ వాంగని గ్రామానికి చెందిన ఎ. నాగ రాజు ముఠాగా ఏర్పడ్డారు. దొంగతనాలు చేయడం ప్రారంభించారు. వీరు పట్టణంలోని పీఆర్ కాలనీ, టీచ ర్స్ కాలనీల్లోని రెండు గృహాల్లో చోరీలకు పాల్పడ్డారు. బంగారు వస్తువులతోపాటు టీవీలు, మిక్సీ, దుప్పట్లను కూడా వదలకుండా అపహరించుకెళ్లారు. బాధి తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు లు విచారణ చేపట్టారు.
శు క్రవారం నాగరాజు, మహాలింగం అశోక్‌కుమార్, మహాలింగం కార్తీక్‌లను అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరి వద్ద ఒక బంగారు బ్రాస్‌లెట్, ఉంగరం, టీవీ, మిక్సీ, ఎలక్ట్రికల్ స్టౌవ్, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. వీటి విలు వ రూ. 2లక్షలు ఉంటుంద న్నారు. ప్రధాన దొంగ అయిన మహాలింగం రమేష్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరు తమిళనాడులో అనేక దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. అక్కడి పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో గిద్దలూరు పట్టణానికి వచ్చి పీఆర్‌కాలనీ సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారని చెప్పారు. పనుల కోసం వచ్చినట్లు ప్రజలకు నమ్మబలికి తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. పట్టణంలో పెద్ద దుకాణాలు, ఇతర కొన్ని ఇళ్లలో చోరీకి వారు ప్రణాళిక సిద్ధం చేసుకోగా అరెస్టు చేసి భగ్నం చేశామని చెప్పా రు. విలేకరుల సమావేశంలో సీఐ యు. సుధాకర్‌రావు, ఎస్‌ఐ షేక్ సమందర్‌వలి పాల్గొన్నారు.