ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని

ABN , First Publish Date - 2020-04-18T10:41:42+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమం కోసం,

ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలని

‘ఉగ్ర’ నిరాహార దీక్ష 


కనిగిరి టౌన్‌, ఏప్రిల్‌ 17 : లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని, వారి సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం 12 గంటల పాటు స్వీయ నియంత్రణ పాటిస్తూ నిరాహార దీక్ష చేపట్టినట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. గుంటూరులోని ఆయన నివాసంలో శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ. 5 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.


అంతే కాకుండా పేదలకు రూ. 5లకే మంచి భోజనం అందించిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరిపించాలని కోరారు. డాక్టర్‌ ఉగ్రకు సంఘీభావంగా కనిగిరితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, కార్యకర్తలు, నాయకులు ఎవరి ఇంటి వద్ద వారే స్వీయ నియంత్రణ పాటిస్తూ సంఘీభావం తెలియజేశారు. కనిగిరిలో దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, బ్రహ్మం గౌడ్‌, తమ్మినేని వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. 


సీఎ్‌సపురంలో...

సీఎ్‌సపురం : లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 వేలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సీఎ్‌సపురం మండల మాజీ వైస్‌ ఎంపీపీ బొబ్బూరి రాజేశ్వరి డిమాండ్‌ చేశారు. తన గృహంలో భర్త బొబ్బూరి రమే్‌షతో కలిసి శుక్రవారం ఆమె 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కటారు తిరుమలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-04-18T10:41:42+05:30 IST