నేడు ప్రభుత్వ భవనాల ప్రారంబోత్సవం
ABN , First Publish Date - 2020-12-15T06:18:40+05:30 IST
: ఎర్రగొండపాలెంలో రూ.70 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాల ప్రారంభానికి ముగ్గురు మంత్రులు హాజరుకానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఎర్రగొండపాలేనికి ముగ్గురు రాష్ట్ర మంత్రుల రాక
ఎర్రగొండపాలెం, డిసెంబరు 14: ఎర్రగొండపాలెంలో రూ.70 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, పుల్లలచెరువు మండలం యండ్రపల్లిలో రూ.12 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాల ప్రారంభానికి ముగ్గురు మంత్రులు హాజరుకానున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటీ వనితలు ముఖ్య అథిధులుగా పాల్గొంటారని తెలిపారు. మొదటగా మంగళవారం మధ్యహ్నం 3 గంటలకు యండ్రపల్లి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఎర్రగొండపాలెం చేరుకోని ఎర్రగొండపాలెం అగ్నిమాపక కేంద్రం ప్రారంభిస్తారన్నారు. అనంతరం సాయంత్రం వైకాపా పార్టీ ఆధ్వర్యంలో జరుతున్న ఐక్య క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొంటారని పీఏ తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.