టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు నియామకం
ABN , First Publish Date - 2020-12-17T05:35:07+05:30 IST
తెలుగునాడు స్టూడెంట్ ఫెడరే షన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఒంగోలు పార్ల మెంట్ నియోజవకర్గ నూతన అధ్య క్ష, కార్యదర్శులుగా తిప్పరపల్లి రవితే జ, పొదిలికి చెందిన షేక్ గౌస్‌బాషా లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ బుధవారం ప్రకటించారు.

ఒంగోలు (కార్పొరేషన్) డిసెంబరు 16 : తెలుగునాడు స్టూడెంట్ ఫెడరే షన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) ఒంగోలు పార్ల మెంట్ నియోజవకర్గ నూతన అధ్య క్ష, కార్యదర్శులుగా తిప్పరపల్లి రవితే జ, పొదిలికి చెందిన షేక్ గౌస్‌బాషా లను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌గోపాల్ బుధవారం ప్రకటించారు. ఒంగోలుకు చెందిన రవితేజ గతంలో టీఎస్‌ఎన్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా, కార్పొరేషన్ ఎన్నికలకు 26వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు. అలాగే బాపట్ల పార్లమెంటరీ అధ్యక్ష, కార్యదర్శులుగా గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన మొవ్వ షరత్‌బాబు, కార్యదర్శిగా బాట్టకు చెందిన కుర్రా ధనేంద్ర కుమార్‌ను నియమించారు. నాయకులు వారికి అభినందనలు తెలిపారు.
