ప్రశాంతంగా ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష
ABN , First Publish Date - 2020-12-06T06:41:16+05:30 IST
ట్రిపుల్ ఐటీల్లో 2020-21 విద్యా సంవ త్సరంలో ప్రవేశాలకు తొలిసారి శనివారం నిర్వహించిన ఆర్‌జీయూకేటీ సెట్-2020 పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

97శాతం మంది హాజరు
ఒంగోలు విద్య, డిసెంబరు 5: ట్రిపుల్ ఐటీల్లో 2020-21 విద్యా సంవ త్సరంలో ప్రవేశాలకు తొలిసారి శనివారం నిర్వహించిన ఆర్‌జీయూకేటీ సెట్-2020 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 7,302 మంది దరఖా స్తు చేసుకోగా 7,066 (97శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని 59 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వర కూ పరీక్ష జరిగింది. విద్యార్థులు ఉదయం 9గంటలకే కేంద్రాలకు చేరుకు న్నారు. మాస్కులు ధరించి పరీక్షకు హాజరయ్యారు. మార్కాపురం జడ్పీ బాలికోన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిశీలించారు.