కారు, మోటార్ సైకిల్ ఢీ: ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2020-03-16T11:16:31+05:30 IST
కారు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొనటంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం మేరకు ఆదివారం
అద్దంకి, మార్చి 15: కారు, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొనటంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం మేరకు ఆదివారం మధ్యాహ్నం పంగులూరు మండలం రామకూరు నుంచి వస్తున్న కారు, అద్దంకి మండలం మర్రంవారిపాలెం వైపు నుంచి వస్తున్న మోటార్ సైకిల్ గుర్రంవారిపాలెం సమీపంలో ఢీకొన్నాయి. దీంతో మోటార్‌సైకిల్ రోడ్డు మార్జిన్‌లో పడిపోగా, కారు పక్కకు వెళ్లి ఆగిపోయింది. ఈ ప్ర మాదంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ముగ్గురు క్ష తగాత్రులను ప్రైవేటు వాహనంలో మార్టూరు లోని వైద్యశాలకు తరలించారు.