వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2020-12-30T06:13:17+05:30 IST

ఆటో అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఎర్రగొండపాలెం మండలం సంగంతాండా నివాసి దేశావత్‌ పెద్ద నరసింహనాయక్‌ (55) రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమైంది.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
మిల్లర్‌ కిందపడి మృతిచెందిన నారాయణమ్మ


ఎర్రగొండపాలెం, డిసెంబరు 29 : ఆటో అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఎర్రగొండపాలెం మండలం సంగంతాండా నివాసి దేశావత్‌ పెద్ద నరసింహనాయక్‌ (55) రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమైంది. ఈ ఘటనలో క్షతగాత్రుడు అక్కడిక్కడే   మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... మండలంలో సంగంతాండాకు చెందిన దేశావత్‌ పెద్ద సరసింహనాయక్‌ తమ బంధువులతో కలసి ఆటోలో పెద్ద దోర్నాల మండలంలో మంతనాలమ్మ గుడికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  వీరభద్రాపురం గ్రామానికి చెందిన బాడుగ ఆటోలో  ప్రయాణిస్తుండగా సర్వాయపాలెం బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌ టేక్‌ చేసే సమయంలో ఆటోడ్రైవరు సడన్‌బ్రేక్‌ వేయడంతో ఆటో బోల్తాపడింది. ఆటోలో నుంచి దేశావత్‌ పెద్ద నరసింహనాయక్‌ రోడ్డు పై పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడని  పోలీసులు తెలిపారు. ఆటోలో మరో 8 మంది బంధువులు ఉండగా వారు క్షేమంగా ఉన్నారు.. కేసునమోదు చేసి ధర్యాప్తు  చేస్తున్నట్లు  పోలీసులు తెలిపారు.


మిల్లర్‌ కింద పడి మహిళ మృతి 

వెలిగండ్ల : మండలంలోని జాళ్లపాలెం గ్రామానికి చెందిన మహిళ మినుము మిల్లర్‌ కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే జాళ్లపాలెం గ్రామానికి చెందిన శ్యామల నారాయణమ్మ, కాకర్ల కాశమ్మ, ఎగటి లక్ష్మిదేవి కలిసి జంగం నర్సయ్యపల్లి వద్ద ఉన్న పొలంలో మినుములు శుద్ధి చేసేందుకు ట్రాక్టర్‌కు మిల్లర్‌ తగిలించుకొని పొలం దగ్గరకు వెళ్లారు. మధ్యలో  పెద్ద రాయిపై టైర్‌ ఎక్కడంతో మిల్లర్‌ తిరగబడింది. మిల్లర్‌పై కూర్చున్న శ్యామల నారాయణమ్మ (45) కింది పడ్డారు. అక్కడ ఉన్న బండ రాయి గుండెకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన  ఇద్దరికి బలమైన గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు  తరలించినట్లు బంధువులు తెలిపారు. 

మార్కాపురం(వన్‌టౌన్‌) : మండలంలోని వేములకోట బస్‌సెంటర్‌లో మద్యం సేవించి లారీ క్లీనర్‌ మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. రూరల్‌ ఎస్‌ఐ కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం పట్టణంలో బ్రహ్మంగారి మఠం వీధిలో నివసించే పి.చిన్నరోశిరెడ్డి(45) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాత్రి ఇంటి నుంచి వేములకోట బస్‌సెంటర్‌ వద్దకు వచ్చి మద్యం సేవించాడు.  మృతుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తుంటాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు.

Updated Date - 2020-12-30T06:13:17+05:30 IST