కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో జడ్పీటీసీలుగా ముగ్గురు

ABN , First Publish Date - 2020-03-16T11:05:21+05:30 IST

మార్కాపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున మార్కాపురం,

కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలో జడ్పీటీసీలుగా ముగ్గురు

పొదిలి రూరల్‌, మార్చి 15: మార్కాపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు మండలాల నుంచి జడ్పీటీసీ అభ్యర్థులుగా ముగ్గురు బరిలో ఉండటం ఎంతో గర్వంగా ఉందని మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ షేక్‌ సైదా అన్నారు.


  నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి వచ్చిందని, ఒత్తిళ్లకు తమ అభ్యర్థులు లొంగిపోలేదన్నారు.   మార్కాపురం అభ్యర్థి గుమ్మళ్ల సుబ్బారావు, తర్లుపాడు నుంచి షేక్‌ బడేసాహెబ్‌, కొనకనమిట్ల నుంచి ధర్నాసి సుబ్బారావులను ప్రజలు ఆధరించాలని కోరారు.

Updated Date - 2020-03-16T11:05:21+05:30 IST