-
-
Home » Andhra Pradesh » Prakasam » third coution in vadarevvu
-
వాడరేవులో ప్రమాద హెచ్చరిక-3
ABN , First Publish Date - 2020-11-27T06:19:08+05:30 IST
నివర్ తుపాను నేపథ్యంలో వాడరేవులో గు రువారం 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇళ్లలో ఉం డేందుకు వీలులేని వారిని గుర్తించి అధికారులు పునరావాస కేంద్రా లకు తరలించారు.

చీరాల, నవంబరు 26 : నివర్ తుపాను నేపథ్యంలో వాడరేవులో గు రువారం 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇళ్లలో ఉం డేందుకు వీలులేని వారిని గుర్తించి అధికారులు పునరావాస కేంద్రా లకు తరలించారు. వారికి అక్కడే భోజన, వసతి ఏర్పాటు చేశారు. తహసీల్దార్ మహ్మద్ హుస్సేన్ వాడరేవు సముద్రతీరంలో పర్యటించా రు. కొత్తపాలెంలో 15 కుటుంబాల వారిని పునరావాస కేంద్రానికి త రలించారు. వేటపాలెం తహసీల్దార్ మహేశ్వరరావు, స్పెషలాఫీసర్ శ్రీనివాసరెడ్డి తీరప్రాంత గ్రామాలను సందర్శించారు. చీరాల ఇంజనీ రింగ్ కళాశాలలో వసతి ఏర్పాటు చేశారు. కాగా గత రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలతో పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో మిరప చేలకు కొంతమేర పంట నష్టం తప్పదంటున్నారు. పత్తి పైరు లో అడుగు కాయలు కుళ్లిపోయే పరిస్థితి ఉంది. చీరాల, వేటపాలెం మండలాల పరిధిలోని మగాణి సాగు చేసిన పల్లు పొలాల్లో వర్షపు నీ రు చేరింది. వేరుశనగకు కొంతమేర నష్టం తప్పదంటున్నారు. నేత కార్మికులు మగ్గం పని ఆపేశారు. మత్స్యకారులు వేటకు వెళ ్లలేదు.