అయ్యవార్ల అగచాట్లు

ABN , First Publish Date - 2020-06-25T11:20:13+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బాట పట్టిన జిల్లాలోని ఉపాధ్యాయులకు మొదటి రోజే చుక్కలు కనిపించాయి. రవాణా సౌకర్యం

అయ్యవార్ల అగచాట్లు

ఒంగోలు విద్య, జూన్‌ 24 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల బాట పట్టిన జిల్లాలోని ఉపాధ్యాయులకు మొదటి రోజే చుక్కలు కనిపించాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఒంగోలు నగరం, చీరాల పట్టణం, మార్కాపురంలోని వివిధ ప్రాంతాలు, వివిధ మండలాల్లో  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన గ్రామాలను కూడా కంటైన్‌మెంటు ప్రాంతాలుగా ప్రకటించారు. ఒంగోలు పరిసర మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 2వేల మందికి పైగా నగరంలో ఉంటుండగా, చీరాల పరిసర మండలాల్లో పనిచేస్తున్న ఉపాఽధ్యాయులు 1000 మందికిపైగా చీరాల పట్టణంలో నివసి స్తున్నారు. ఈ రెండు ప్రాంతాలు పూర్తి కంటైన్‌మెంట్‌ జోన్‌లు కావడంతో ఇక్కడ నుంచి ఉపాఽధ్యాయులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు.


బస్సులు లేవు. ఆటోల కదలికలపై పోలీసులు ఆంక్షలు విధించడంతో ఉపాధ్యాయులు స్కూళ్లకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. అయితే పాఠశాలలకు హాజరవుతున్న ఉపాధ్యాయులను కరోనా భయం వెంటాడుతోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్‌ పరికరాలు పక్కన పెట్టగా ఒక్క పాఠశాలల్లో మాత్రమే అమలు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ వ్యాప్తి తగ్గి రవాణా సౌకర్యాలు మెరుగు పడేంతవరకు పాఠశాలల తెరవకూడదని వారు కోరుతున్నారు.  

Updated Date - 2020-06-25T11:20:13+05:30 IST