-
-
Home » Andhra Pradesh » Prakasam » There is no shortage of masks and sanitizers in the district
-
జిల్లాలో మాస్కులు, శానిటైజర్లకు కొరత లేదు
ABN , First Publish Date - 2020-03-24T10:49:22+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే శానిటైజర్లు, మాస్కులకు కొరత లేదని ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదు

ఒంగోలు నగరం, మార్చి 23 : కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే శానిటైజర్లు, మాస్కులకు కొరత లేదని ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాదు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తగినన్ని మాస్కులు, శానిటైజర్లు మందుల దుకాణాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 56 మందుల దుకాణాల్లో 20,725 మాస్కులు, 1851 శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు వీటిని కొనుగోలు చేసి వాడుకోవాలని కోరారు.