-
-
Home » Andhra Pradesh » Prakasam » theft locked house
-
తాళం వేసిన ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2020-03-13T11:03:42+05:30 IST
తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చోరీకి పాల్ప డి రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు.

ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ
వెంబడించిన ఎస్టీఎఫ్ కానిస్టేబుల్
ఒంగోలు (క్రైం), మార్చి 12 : తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా చోరీకి పాల్ప డి రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లారు. ఈ సం ఘటన గురువారం తెల్లవారుజామున స్థానిక స త్యనారాయణపురంలోని దిబ్బలరోడ్డులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళి తే... ఆర్టీసీలో రిటైర్డు కండక్టర్ ఎస్‌కె.మస్తాన్ దిబ్బలరోడ్డులోని రామాలయం వెనుక అద్దె ఇంటిలోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. బుధవారం ఇంటికి తాళం వేసి కు టుంబసభ్యులతో కలసి విజయవాడ వెళ్లాడు. అర్ధరాత్రి ఇదే అదునుగా భావించిన దొంగ ఇంటి తాళం పెకలించి లోపలకెళ్లాడు. బీరువా తాళాలు తీసి వెతుకుతుండగా అలికిడి అయ్యింది. పైఅంతస్థులో ఉండే ఎస్‌టీఎఫ్ కానిస్టేబుల్ భా ర్య ఆ శబ్ధాన్ని గమనించి భయపడింది. వెంటనే ఫోన్ ద్వారా విధులలో ఉన్న తన భర్తకు తెలిపింది.
కానిస్టేబుల్ మోటారు సైకిల్‌పై వచ్చే సరికి దొంగ రెండో అంతస్థులో వరండాలో కనిపించాడు. కానిస్టేబుల్ దొంగా.. దొంగా అని అరవడంతో ఆగంతకుడు పరారీ అయ్యాడు. కానిస్టేబుల్ వెంబడించినా ఫలి తం లేదు. తెల్లవారిన తరువాత ఇంటి యజమాని మస్తాన్ వచ్చి ఇంట్లో పరిశీలించి పదహరున్నర సవర్ల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాలుకా ఇన్‌స్పెక్టర్ ఎం.లక్ష్మణ్, ఎస్సై సాంబశివరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.