గ్రామీణులు ఇంటికే పరిమితం కావాలి
ABN , First Publish Date - 2020-03-27T10:13:11+05:30 IST
గ్రామీణులు ఇంటికే పరిమితం కావాలని ఒంగోలు ఎంపీడీవో పీవీ నారాయణ పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని
ఒంగోలురూరల్, మార్చి 26 : గ్రామీణులు ఇంటికే పరిమితం కావాలని ఒంగోలు ఎంపీడీవో పీవీ నారాయణ పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం, కరవది, ఉలిచి, దేవరంపాడు, గుండాయిపాలెం గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి రవికుమార్‌తో కలిసి గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీవో మాట్లాడారు.
ప్రజలను రోడ్లపై తిరగనీయకుండా చూడాలన్నారు. వ్యవసాయ పనులకు వీలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారి వివరాలను తనకు తెలియ చెప్పాలన్నారు. తాగునీటిని క్లోరినేషన్ చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు రంగారెడ్డి, సురేష్ పాల్గొన్నారు.