కరోనా నియంత్రణలో పోలీసుల పాత్ర ప్రశంసనీయం

ABN , First Publish Date - 2020-06-25T11:10:14+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణలో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ అన్నారు. బుధవారం ఒంగోలులోని

కరోనా నియంత్రణలో  పోలీసుల పాత్ర ప్రశంసనీయం

 ఒంగోలు(క్రైం), జూన్‌ 24 : జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణలో పోలీసులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ అన్నారు. బుధవారం ఒంగోలులోని చర్చిసెంటర్‌లో పోలీస్‌ శాఖకు దాతలు ఇచ్చిన ఐరన్‌ బారికేడ్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసులకు జిల్లా ప్రజలు ఇచ్చిన సహకారం అఽబినందనీయమన్నారు.


అనంతరం దాత వెంగముక్కపాలెంనకు చెందిన ఇ.శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన తండ్రిని శాలువా కప్పి సత్కరించారు. అలాగే వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ను సందర్శించి అక్కడ క్రిమిసంహారక టన్నెల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ ప్రతా్‌పకుమార్‌, సీఐలు లక్షణ్‌, బీమానాయక్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-25T11:10:14+05:30 IST