మంత్రి ‘బాలినేని’ రాజీనామా చేయాలి

ABN , First Publish Date - 2020-03-16T11:30:16+05:30 IST

ఎన్నికల ప్రక్రియలో ఉపసంహరణలు ప్రారంభం కాకముందే వివిధ స్థానాలు ఏకగ్రీవం

మంత్రి ‘బాలినేని’ రాజీనామా చేయాలి

ప్రజాస్వామ్య విలువలు ఖూనీ

జనసేన ఒంగోలు పార్లమెంట్‌ 

ఇన్‌చార్జ్‌  షేక్‌ రియాజ్‌  ఆవేదన


ఒంగోలు(క్రైం), మార్చి 15 : ఎన్నికల ప్రక్రియలో ఉపసంహరణలు ప్రారంభం కాకముందే వివిధ స్థానాలు ఏకగ్రీవం అయినట్టు ప్రక టించడం ప్రజాస్వామ్య విలువ లను ఖూనీ చేసినట్లేనని జనసేన ఒంగోలు పార్లమెంటు ఇన్‌చార్జ్‌ షేక్‌ రియాజ్‌  పేర్కొన్నారు. అందుకు బాధ్యత వహించి మంత్రి ‘బాలినేని’ రాజీ నామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. స్థానిక జిల్లా జనసేన పార్టీ  నిర్వహించిన సమావేశంలో రియాజ్‌ మాట్లాడుతూ, ఆదివారం నుంచి మున్సిపల్‌ ఎన్నికల ఉపసంహరణల పర్వం ప్రారంభమయ్యిందన్నారు.  ఒంగో లు 25 డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవమైనట్టు ప్రకటిం చుకొని సంబరాలు చేసుకో వడం ఎంతవరకు  సమంజ సమని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్వంలో ఉన్నామా? లేక  ఎక్కడ ఉన్నా మన్న సందేహం కలుగుతుందన్నారు.


కార్పొరేషన్‌లో 50 డివి జన్‌లు తమవేనని వైసీపీ నేతలు విర్రవీగడం, ప్రతి పక్షాల అంతు చూస్తామని బెదిరించడం సరైన చర్య కాదన్నారు. ఎన్నికల కమిషన్‌ కరోనా ఎఫెక్ట్‌ మూలంగా ఎన్నికలు వాయిదా వేసిందని తెలిపారు. అధికార పక్షం ప్రతిపక్షాల వారిని బెదిరించి అనేక మందిని నామినేషన్లు వేయకుండా చేశారని ఆరోపించారు.ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని రద్దుచేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేశారు. ప్రజా వ్యతిరేకత ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నందున మంత్రి బాలినేని శ్రీని వాసరెడ్డి  రాజీ నామా చేయాలని కోరారు.  

Updated Date - 2020-03-16T11:30:16+05:30 IST