బాలిక నిశ్చితార్థం అడ్డగింత

ABN , First Publish Date - 2020-07-14T10:37:45+05:30 IST

మండలంలోని చెమిడదెపాడులో ఓ బాల్యవివాహాన్ని అధికారులు సోమవారం అడ్డుకున్నారు.

బాలిక నిశ్చితార్థం అడ్డగింత

గుడ్లూరు, జూలై 13 : మండలంలోని చెమిడదెపాడులో ఓ బాల్యవివాహాన్ని అధికారులు సోమవారం అడ్డుకున్నారు. 15ఏళ్ల బాలికకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు సోమవారం నిశ్చితార్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఉలవపాడు సెక్టార్‌ సూపర్‌వైజర్‌ అక్కడికి చేరుకొని దాన్ని నిలిపివేశారు. బాలిక తల్లికి బాల్యవివాహ చట్టంపై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చట్టాన్ని వ్యతిరేకించి వివాహం చేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి శ్రీలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్త పద్మశ్రీ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T10:37:45+05:30 IST