ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2020-03-19T11:00:32+05:30 IST

కరోనా లాంటి వైరస్‌ సోకుతున్న తరుణంలో సేవా దృక్పథంతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్‌

ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు అభినందనీయం

మద్దిపాడు, మార్చి18 : కరోనా లాంటి వైరస్‌ సోకుతున్న తరుణంలో సేవా దృక్పథంతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్‌ భాస్కర్‌ అన్నారు. బుధవారం ఏడుగుండ్లపాడు ఓంశ్రీ విశ్వకర్మ గాయిత్రీ విశ్వవిద్యాలయంలో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాట్లను  కలెక్టర్‌ పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పనితీరు మెరుగు పరుచుకోవాలన్నారు.


జిల్లా వైద్యఆరోగ్యశాఖ కరోనా వ్యాధి పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సేవలు వైద్యం అందించే విధంగా వైద్య బృందం సంసిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో మరిన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది వైద్యులు విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వారు పనితీరు మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


జిల్లాలో గిద్దలూరు, మార్కాపురం, పొదిలి, ఎర్రగొండపాలెం, చీరాల తదితర కేంద్రాల్లో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు.  ఒంగోలు ఆర్టీవో ప్రభాకరరెడ్డి, విశ్వకర్మ విశ్వవిద్యాలయం ఎండీ గిరినాథ్‌ , డీఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పద్మావతి , డాక్టర్‌ చంద్రశేఖరబాబు, తహసీల్దార్‌ కె.బాబ్జీ, ఎంపీడీవో సీహెచ్‌.హనుమంతరావు, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. c

Updated Date - 2020-03-19T11:00:32+05:30 IST