-
-
Home » Andhra Pradesh » Prakasam » The civil disobedience program must be conquered
-
శాసనోల్లంఘన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2020-06-22T10:57:13+05:30 IST
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్యర్యంలో జూ లై 3న నిర్వహించే శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ కార్యక్రమాలను జ యప్రదం చేయాలని

ఒంగోలు (ప్రగతిభవన్), జూన్ 21: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్యర్యంలో జూ లై 3న నిర్వహించే శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ కార్యక్రమాలను జ యప్రదం చేయాలని కార్మిక సంఘాలు కోరాయి. ఆదివారం ఒంగోలులోని ఎల్‌బీ జీ భవన్‌లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని డి మాండ్ చేశారు.
ఆరు మాసాల పాటు ప్రతి కుటుంబానికి రూ.10వేలు నగదు, బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, గంటెనపల్లి శ్రీనివాసరావు, వైఎస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు వీరాస్వామిరెడ్డి, ఆశా వర్కర్స్ నాయకురాలు కల్పన, ఐఎఫ్‌టీయూ మోహన్, రంగారావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.