సేవ పేరుతో అధికార పార్టీ కార్యక్రమాలా!

ABN , First Publish Date - 2020-04-24T10:58:38+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైసీపీ నేతలు సేవ కార్యక్రమాల పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారని

సేవ పేరుతో అధికార పార్టీ కార్యక్రమాలా!

ఆమంచిపై టీడీపీ నేత బాలాజీ ధ్వజం


చీరాల, ఏప్రిల్‌ 23 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో వైసీపీ నేతలు సేవ కార్యక్రమాల పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యడం బాలాజీ ధ్వజమెత్తారు. ఆయన స్థానికంగా ఉన్న తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. స్థానిక వైసీపీ నాయకులు నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలను పోలీసులు నియంత్రించాలని కోరారు.


సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికీ కరోనా మహమ్మారిని పట్టించుకోకుండా కేవలం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యూహాలు పన్నుతూప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ తన పద్ధతి మార్చుకోవాలన్నారు. వైసీపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు ఆమంచి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ వద్ద ఆమంచి ఎదగాలనుకోవటం అవివేకమని, తన అనుభవంతో చెప్తున్న మాటలను గుర్తుంచుకోవాలని హితవుపలికారు. 

Updated Date - 2020-04-24T10:58:38+05:30 IST