-
-
Home » Andhra Pradesh » Prakasam » The appointment of two examiners to the district
-
జిల్లాకు ఇద్దరు పరిశీలకుల నియామకం
ABN , First Publish Date - 2020-03-13T10:58:36+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీనియర్ అధికారులను నియమిస్తూ ఎన్నికల

ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 12 : స్థానిక సంస్థల ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీనియర్ అధికారులను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్‌ను సాధారణ పరిశీలకులుగా నియమించగా, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబును ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించింది. జిల్లాలోని ఓటర్లు, అభ్యర్థులు ఏమైనా సమస్యలు, అభ్యంతరాలు ఉంటే 6309327937, 99493 27937 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించింది.