ఆ ఫీల్డ్‌ అసిస్టెంటును కొనసాగించాలి

ABN , First Publish Date - 2020-06-04T10:10:48+05:30 IST

కొర్రపాటివారిపాలెం ఫీల్డ్‌అసిస్టెంట్‌గా గొల్లపూడి శ్రీనివాసరావును కొనసాగించాలని మాజీ సర్పంచ్‌ కొర్రపాటి లక్ష్మీనారాయణ..

ఆ ఫీల్డ్‌ అసిస్టెంటును   కొనసాగించాలి

తాళ్లూరు, జూన్‌ 3 : కొర్రపాటివారిపాలెం ఫీల్డ్‌అసిస్టెంట్‌గా గొల్లపూడి శ్రీనివాసరావును కొనసాగించాలని మాజీ సర్పంచ్‌ కొర్రపాటి లక్ష్మీనారాయణ, కె.చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు ఉపాధి కూలీలు బుధవారం ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల గ్రామంలో హౌస్‌ లెవలింగ్‌ వేజ్‌ అమౌంట్‌ కింద నాలుగు లక్షల రూపాయల పనులు జరిగాయని, కొందరు అదనపు మస్టర్లు వేయాలని శ్రీనివాసరావుపై ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదన్న కారణంతో దొంగమస్టర్లు వేస్తున్నాడని జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌కు తప్పుడు ఫిర్యాధు చేశారని వివరించారు. కార్యక్రమంలో వెంకటేష్‌, వెంకట్రావు, పోతురాజు దాదాపు 50 మందికి పైగా ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T10:10:48+05:30 IST