అద్దెకు గోదాములు !

ABN , First Publish Date - 2020-12-02T05:20:48+05:30 IST

కేంద్రం తీసుకు వ చ్చిన నూతన చట్టాలతో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ఆ దాయం సన్నగిల్లడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. యార్డుల పరిధిలో ఉన్న గోదాములను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వడం ద్వారా రాబడిని పొందాలని ప్రణా ళికలు రూపొందించింది.

అద్దెకు గోదాములు !



జిల్లాలో 15 మార్కెట్‌ యార్డుల పరిధిలో 78 గౌడౌన్‌

ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు


 ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 1 :  కేంద్రం తీసుకు వ చ్చిన నూతన చట్టాలతో వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ఆ దాయం సన్నగిల్లడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. యార్డుల పరిధిలో ఉన్న గోదాములను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వడం ద్వారా రాబడిని పొందాలని ప్రణా ళికలు రూపొందించింది. జిల్లావ్యాప్తంగా 15 మార్కెట్‌ యార్డుల పరిధిలో 78 గోడౌన్‌లు ఉండగా, వీటిలో 51 గోదాములు ఇప్పటికే పౌరసరఫరాలశాఖ, ఎఫ్‌సీఐలు అద్దెకు వినియోగించుకుంటున్నాయి. మిగిలిన 27 గోడౌన్‌లను కిరాయికి ఇవ్వడానికి ఆన్‌లైన్‌లో  టెండర్లను ఆహ్వనించారు. ఈ నెల 27ను  బిడ్ల  దాఖలుకు చివరి తేదీగా నిర్ణయిం చారు. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి వరకు అద్దెకు ఇస్తారు. టెండర్లను ఆన్‌లైన్‌లో పిలిచినప్పటికీ వాటి ద్వారా వచ్చే రాబడి ఆయా మార్కెట్లకు చెల్లించేలా నిబంధనలు పొందుపరి చారు. దీనివల్ల యార్డులకు కొంతమేర ఆదాయం సమకూరే అవకాశముంది


నిలిచిపోనున్న సేవలు...


మార్కెట్‌ యార్డు గోదాముల్లో రైతులు తమ పంట ఉత్పత్తులను నామమాత్రపు ధర చెల్లించి రైతుబంధు పథకం కింద నిల్వ చేసుకునేవారు. జిల్లాలో లీజుకు ఇచ్చి నవి పోను 27గోదాములలో రైతులు తమ ఉత్పత్తులను భద్రపరచుకునేవారు. ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం తలపెట్టింది.  మార్కె ట్‌లో ధర తమకు అనుకూలంగా లేనప్పుడు గిట్టుబాటు ధర వచ్చేవరకు వీటిలో నిల్వ చే సుకునేవారు. జిల్లాలో సాగవుతున్న పంటల విస్తీర్ణం దృష్ట్యా అందుబాటులో  ఉన్న గోడౌన్‌ లు రైతులకు ఎంతమాత్రం సరిపోక ఇబ్బందులున్నారు. ఈనేపథ్యంలో ఉన్నవాటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు గోదాములు అద్దెకు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే యార్డు లు మనుగడ సాగించాలంటే ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెట్టక తప్పని పరిస్థితి ఏర్ప డిం దని అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2020-12-02T05:20:48+05:30 IST