కీలక దశకు చేరిన టీచర్ల బదిలీ ప్రక్రియ

ABN , First Publish Date - 2020-11-23T05:07:03+05:30 IST

జిల్లాలో ఉపా ధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ కీ లక దశకు చేరుకుంది.

కీలక దశకు చేరిన టీచర్ల బదిలీ ప్రక్రియ

నేడు జేసీ  ప్రాధాన్యత కేటగిరి దరఖాస్తుల పరిశీలన


ఒంగోలువిద్య, నవంబరు 22: జిల్లాలో ఉపా ధ్యాయుల బదిలీలకు సంబంధించిన ప్రక్రియ కీ లక దశకు చేరుకుంది. ప్రాధాన్యత కేటగిరీ దర ఖాస్తుల పరిశీలన సోమవారం నుంచి ప్రారం భం కానుంది. జిల్లాలో మొత్తం 11,591 మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండ ల పరిషత్‌ యాజమాన్యాలలోని  పాఠశాలల్లో ప నిచేస్తున్నారు. వీరిలో 5633 మంది బదిలీ కోసం దరఖాస్తు చేశారు. ఈ మొత్తంలో 1718 మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉండగా 3915 మంది టీచర్లు అభ్యర్థన మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే బదిలీల్లో ప్రాధాన్యత కేటగిరిల్లో ఎక్కువ డిమాం డ్‌ ఉంది. గతంలో కొంతమంది ఉపాధ్యాయులు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి బదిలీల్లో లబ్ధి పొందినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేప థ్యంలో ప్రాధాన్యతా కేటగిరీల విషయంలో జాగ్ర త్తగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు నిర్ణ యించారు. ఈమేరకు  ప్రాధాన్యతా కేటగిరిల్లో దరఖాస్తు చేసిన టీచర్ల బదిలీ దరఖాస్తులను జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) స్వయంగా పరిశీలి ంచి అర్హులైన వారికి ఆమోద ముద్రవేస్తేనే ప్రా ధాన్యత కేటగిరిల్లో చోటు దక్కుతుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, విత ంతువులు, అవివాహితులు, స్పౌజ్‌, దివ్వాంగుల దరఖాస్తులు మాత్రమే జేసీ పరిశీలనకు పంపు తున్నారు. కొందరు భార్యభర్తలు ఇరువురు స్పౌజ్‌ కేటగిరిలో దరఖాస్తు చేయగా పరిశీలనాధికారు లు కొందరిని గుర్తించి వారిని పిలిపించి స్పౌజ్‌ కే టగిరిని ఉపసంహరింపజేశారు. అదేవిధంగా ది వ్యాంగులు,  ఇతర వ్యాధులతో బాధపడేవారు తాజాగా మెడికల్‌బోర్డు నుంచి తీసుకున్న వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంది. కానీ కొంతమంది పాత పత్రాలే సమర్పించారు. అయితే డీఎస్సీలో దివ్వాంగుల కోటాలో ఉపా ధ్యాయులుగా ఎంపికైన వారికి మాత్రమే తాజా సర్టిఫికెట్ల సమర్పణ నుంచి ప్రభుత్వం మినహా యింపు ఇచ్చింది. అదేవిధంగా బదిలీల్లో ప్రాథ మిక సీనియారిటీ జాబితా, పాయింట్లు వివరాలు బయటకు వస్తే కానీ ప్రాధాన్యత కేటగిరిల్లో స మర్పించిన దరఖాస్తుల భవితవ్యం తేలుతుందని పలువురు ఉపాధ్యాయులు వాఖ్యానిస్తున్నారు. 


Updated Date - 2020-11-23T05:07:03+05:30 IST