మళ్లీ మొదలు.. టీచర్ల బదిలీలకు తాజా షెడ్యూలు విడుదల
ABN , First Publish Date - 2020-11-03T17:33:24+05:30 IST
ఉపాధ్యాయ బదిలీలకు తాజా షెడ్యూలు..
41 రోజుల ప్రణాళిక
డిసెంబరు 14నాటికి ప్రక్రియ పూర్తి
ఒంగోలు: ఉపాధ్యాయ బదిలీలకు తాజా షెడ్యూలు విడుదలైంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పునర్విభజన, బదిలీలకు సంబంధించిన షెడ్యూలును సోమవారం పాఠశాల విద్య డైరెక్టర్ వి.చినవీరభద్రుడు విడుదల చేశారు. ఈనెల 4 నుంచి ప్రారంభమై డిసెం బరు 14నాటికి బదిలీల ప్రక్రియ మొత్తం పూర్తయ్యేలా 41 రోజులు ప్రణాళిక ను ప్రకటించారు. అందులో రోజువారీ చేయాల్సిన కార్యక్రమాలను పొందుప రిచారు. ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి సోమవారం నాటికి ఆన్‌లైన్‌లో నమోదైన విద్యార్థుల యుడైస్ చైల్డ్‌ఇన్‌ఫో డేటాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రధానోపాధ్యాయుల నుంచి తమ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగారంటే మాన్యువల్‌గా ఇచ్చే అభ్యర్థనలు స్వీకరించాలి. కేవలం చైల్డ్ ఇన్‌ఫో డేటా ఆధారంగానే ఉపాధ్యాయుల పునర్విభజన అవసరమున్న పాఠశాలలకు మిగతాచోట్ల మిగులుగా ఉన్న వారిని సర్దుబాటు చేస్తారు.
తాజా షెడ్యూల్ ఇదీ..
ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియ ఈనెల 4నుంచి ప్రారంభ మవుతుంది. 9తేదీ వరకు ఆరు రోజులపాటు చైల్డ్ ఇన్‌ఫో డేటా ఆధారంగా మొత్తం ఆరు రోజుల్లో టీచర్ల పునర్విభజన కార్యక్ర మాన్ని పూర్తి చేస్తారు.
10, 11 తేదీల్లో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను ప్రకటిస్తారు. యాజమాన్యం వారీగా కేటగిరీ, మీడియం వారీగా ఆయా సబ్జెక్టు టీచరు పోస్టులు, ఇతర పోస్టు లు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లల వారీగా ఖాళీలు ప్రకటిస్తారు.
12 నుంచి 16తేదీ వరకు ఐదురోజుల పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ అటెస్టేషన్ తో బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
17, 18 తేదీల్లో ఆన్ లైన్‌లోనే టీచర్ల బదిలీ దరఖాస్తుల పరిశీ లన జరుగు తుంది.
19 నుం చి 23వ రకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు లభించిన ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు.
24 నుంచి 26 వరకూ ప్రాథమిక సీనియారిటీ జాబితాపై అభ్యంత రాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి డీఈవోకు తగిన ఆధారాలు సమర్పించాలి.
17 నుంచి 29 వరకు జాయింట్ కలెక్టర్ ఆమోదంతో డీఈవో అభ్యం తరాలను పరిష్కరిస్తారు.
30 నుంచి డిసెంబరు 2 వరకు ఉపాధ్యాయుల తుది సీనియారిటీ జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
డిసెంబరు 3 నుంచి 5వరకూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు తమ బదిలీ కోరుకునే స్థానాలకు ప్రాధాన్యతా క్రమంలో వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలి.
6 నుంచి 11 వరకూ హెచ్‌ఎంలు, టీచర్లకు స్థానాలు కేటాయిస్తారు.
12, 13 తేదీల్లో ఏమైనా సాంకేతికపరమైన అంశాలు వస్తే వాటిని పరిష్కరించి తుది జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఉపాధ్యాయుల ఫోన్‌కు వారికి ఏస్థానం కేటాయించింది ఎస్‌ఎంఎస్ చేస్తారు.
డిసెంబరు 14న వెబ్‌సైట్‌లో బదిలీ ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుతారు. ఆ రోజు వాటిని టీచర్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఈ షెడ్యూలు ఎటువంటి మినహాయింపు లేకుండా అమలు చేయాలని ఆర్జేడీలను, డీఈవోలను డైరెక్టర్ ఆదేశించారు.