మారుమూల పాఠశాలలకు ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2020-12-16T05:22:21+05:30 IST

మారుమూల గ్రామాల పాఠశాలలోని ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే వెబ్‌కౌన్సిలింగ్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తులు కోరామని రాష్ట్ర విద్యాశాఖామాత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

మారుమూల పాఠశాలలకు ఉపాధ్యాయులు
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్‌

వెబ్‌ కౌన్సిలింగ్‌ లక్ష్యం ఇదే

ఉపాధ్యాయ బదిలీల్లో పారదర్శకత పాటిస్తున్నాం

విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌

  ఎర్రగొండపాలెం, డిసెంబరు 15 : మారుమూల గ్రామాల పాఠశాలలోని ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే వెబ్‌కౌన్సిలింగ్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తులు కోరామని రాష్ట్ర విద్యాశాఖామాత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ఎర్రగొండపాలెంలోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం రూ.1.73 లక్షల పోస్టులు ఉన్నాయన్నారు. వాటిలో అన్ని కేటగిరి పాఠశాలల్లో కలిపి 48890 పోస్టులకు ప్రస్తుతం బదిలీలు జరుగుతున్నారు. జీవో నంబరు 53, 54 ద్వారా నియామక ప్రకియ ప్రారంభించినట్లు తెలిపారు. పాఠశాలలను నాలుగు కేటగిరీలుగా విభజించి  4వ క్యాటరిగిలో కూడా ఖాళీగా ఉన్నపాఠశాలలో ఉపాధ్యాయులను నియమించేందుకు కృషి చేస్తున్నారు. దీని కోసం 1వ 2వ 3వ క్యాటగిరీలలో కొన్ని పోస్టులను బ్లాక్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పనిచేసిన కాలంలో పాఠశాలలో వారు కనబరిచిన ప్రతిభ, సీనియారిటీ ఆధారంగా కౌన్సింగ్‌లో పాయింట్లు కలుస్తాయన్నారు. ఉపాధ్యాయుల బదిలీలలో ఎవరి ప్రమేయం ఉండదన్నారు. పారదర్శకంగా వెబ్‌కౌన్సిలింగ్‌ జరుగుతుందన్నారు. ప్రస్తుతం అన్ని కేటగిరిలలోకలిపి 32889 పోస్టులను వెబ్‌ కౌన్సిలింగ్‌లో భర్తీ చేస్తున్నామన్నారు. మిగిలిన 16001 వేల పోస్టులు మాత్రమే బ్లాక్‌లిస్టులో ఉన్నాయన్నారు. వచ్చే డీఎస్సీలో ఉపాధ్యాయుల ఎంపికకు ముందే ఆ 16001 పోస్టులకు కూడా ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మంగళవారం ఉదయం 11.45 గంటల వరకు రాష్ట్రంలో 74110 ఆన్‌లైన్‌ దరఖాస్తులు వచ్చాయన్నారు. 44561 మంది ఉపాధ్యాయులకు వెబ్‌ ఆప్షన్‌ 58.55 శాతం అందుబాటులో ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో 66.05 శాతం అత్యధికంగా ధరఖాస్తులు బదిలీలకోసం వచ్చాయన్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల కోరితే మరో రోజు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులకు గడువు పెంచుతామన్నారు.

Updated Date - 2020-12-16T05:22:21+05:30 IST