టీడీపీ అభివృద్ధి పనులకు వైసీపీ ప్రారంభోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-28T06:09:13+05:30 IST

గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో చేపట్టిన అభి వృద్ధి పనులకు నేడు వైసీపీ నేతలు ప్రారంభోత్స వాలు చేసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు దామచర్ల జనార్దన్‌ ఎద్దేవా చేశారు.

టీడీపీ అభివృద్ధి పనులకు వైసీపీ ప్రారంభోత్సవాలు
టీడీపీ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న దామచర్ల జనార్దన్‌, నాయకులు

ఏడాదిన్నరలో ఒంగోలులో చేసింది శూన్యం

రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల విమర్శలు


ఒంగోలు (కార్పొరేషన్‌) డిసెంబరు 27 : గత తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో చేపట్టిన అభి వృద్ధి పనులకు నేడు వైసీపీ నేతలు ప్రారంభోత్స వాలు చేసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు దామచర్ల జనార్దన్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడా దిన్నరలో అభివృద్ధి శూన్యమన్నారు. మూడు రాజ ధానుల నిర్ణయంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలోనూ నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపి ంచారు. పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడు తున్న ముఖ్యమంత్రి జగన్‌, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి కీ పథకాలు అంటూ వైసీపీ నేతలు అవినీతికి తె రతీస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే ఒంగోలు ని యోజకవర్గంలో ఏడాదిన్నరగా అభివృద్ధి కరువైం దన్నారు. మినీస్టేడియం పూర్తి చేయడానికి తెలు గుదేశం ప్రభుత్వం నిధులు కేటాయించిందని గు ర్తు చేశారు. అలాగే గుండాయపాలెం జెట్టిని తా ను ఎమ్మెల్యేగా రూ.6కోట్లు నిధులు వెచ్చించి ని ర్మాణం చేపడితే దానికి జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభోత్సవం చేసుకుంటున్నారని విమర్శించారు. అభివృద్ధి పనులను ప్రారంభోత్స వం చేయడాన్ని తాము తప్పపట్టడం లేదన్నారు. అయితే స్వయాన సీఎం బంధువైన మంత్రి బాలి నేని, అలాగే నియోజకవర్గ ప్రజలు నాలుగుసార్లు గెలిపించినందుకైనా అదనపు నిధులు తీసుకువ చ్చి ఒంగోలును మరింత అభివృద్ధి చేయాలని డి మాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక క నీసం కాలువలు, రహదారులు పనులు కూడా మొదలుకాలేదని దామచర్ల విమర్శించారు. యర జర్లలో ఇంటి పట్టాల పంపిణీ ఆగిపోవడానికి టీ డీపీ కారణమని ఆరోపణలు చేయడం సరికాద న్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టడంలో ప్ర భుత్వం ఘోరంగా విఫలమైందని, దిశ చట్టం అ మలు ప్రకటనలకే పరిమితమైందని ఆరోపించా రు. ఇళ్ళ పట్టాల పంపిణీలో ప్రజలకు, పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. అంతేగాకుండా ఇళ్ళ పట్టాలను నగరానికి దూరంగా ఇవ్వడం మొ క్కుబడి తంతే అని ఆయన విమర్శించారు. టీడీ పీ హయాయంలో జీ+3 గృహాలను నగరానికి ద గ్గరగా, రోడ్డు పక్కనే నిర్మాణం చేపట్టామన్నారు. అయితే జి+3 ఇళ్ల కేటాయింపుల్లో గతంలో లా టరీలో పేర్లు వచ్చిన లబ్ధిదారుల పేర్లు ప్రస్తుతం లేవని, వారికి తిరిగి అందజేసే వరకు న్యాయపో రాటానికి సిద్ధమని దామచర్ల స్పష్టం చేశారు. అ నంతరం టీడీపీ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస రావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొఠారి నాగేశ్వరరా వు, కుసుమకుమారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T06:09:13+05:30 IST