రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-07T05:02:39+05:30 IST

ఒంగో లు నగరంలోని 5,6,7,8, డివిజన్‌లలో అసంపూ ర్తిగా ఉన్న ప్రధాన రహదారుల నిర్మాణం వెం టనే చేపట్టాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.

రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

టీడీపీ నాయకుల డిమాండ్‌

నగరంలో పోస్టుకార్డు ఉద్యమం

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 6 : ఒంగో లు నగరంలోని 5,6,7,8, డివిజన్‌లలో అసంపూ ర్తిగా ఉన్న ప్రధాన రహదారుల నిర్మాణం వెం టనే చేపట్టాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కమ్మపాలెం, గోపాల్‌నగరం, శ్రీనివాస థియేటర్‌ సమీపంలో నిరసన కార్యక్ర మం నిర్వహించారు. నగర అధ్యక్షులు కొఠారి నా గేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హ యాంలో తమ నాయకుడు దామచర్ల జనార్దన్‌ నేతృత్వంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లే దని ఆరోపించారు. రోడ్లు, సెంటర్‌ డివైడర్లు, సెం ట్రల్‌ లైటింగ్‌, పచ్చదనం, పరిశుభ్రత వంటి వా టికి ప్రాధాన్యత యిచ్చి అనేక అభివృద్ధి పనుల కు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ని పలు డివిజన్లు అధ్వానంగా తయారైనట్లు వి మర్శించారు. మాజీ కౌన్సెలర్‌ దాచర్ల వెంకటర మణయ్య మాట్లాడుతూ నగర సమస్యలను ము ఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పోస్టుకార్డు ఉ ద్యమం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కొఠారి శ్రీనివాసరావు, కామరాజుగడ్డ కుసుమకుమారి, కామేపల్లి శ్రీనివాసరావు, నం డూరి చంద్ర, పసుపులేటి సునీత, దాయనేని ధ ర్మ, పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.


Read more