టీడీపీ ఎమ్మెల్యేల నెల జీతం విరాళం

ABN , First Publish Date - 2020-03-25T10:13:28+05:30 IST

కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళంగా

టీడీపీ ఎమ్మెల్యేల నెల జీతం విరాళం

కరోనా కట్టడి చర్యలకు అందజేయనున్నట్లు ప్రకటన

ముఖ్యనేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌


ఒంగోలు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వ నున్నారు. ఆమేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఆయా జిల్లాల్లో పరిస్థితులు, టీడీపీ శ్రేణులు సహకరించా ల్సిన అంశాలపై పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ము ఖ్యనేతలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


జిల్లా నుంచి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌ ఇతర ముఖ్యనేతలు తమ ఇళ్ల వద్ద నుంచే పాల్గొన్నారు. ఆసందర్భంగా పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలన్న అంశం చర్చకు వచ్చింది. అందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు తమ వేత నాన్ని ఇస్తామని ప్రకటించారు. 

Read more