టీడీపీ వ్యవసాయ హైలెవల్ కమిటీ సభ్యునిగా ‘ఏలూరి’
ABN , First Publish Date - 2020-12-12T05:11:33+05:30 IST
తెలు గుదేశం పార్టీ వ్యవసాయ హైలెవల్ కమిటీ సభ్యు నిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని యమితులయ్యారు.
ఒంగోలు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలు గుదేశం పార్టీ వ్యవసాయ హైలెవల్ కమిటీ సభ్యు నిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని యమితులయ్యారు. రైతు సమస్యల అఽధ్యయనం, పరిష్కార మార్గాలు, అందుకు పార్టీపరంగా తీసు కోవాల్సిన చర్యలు, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు పోరాట కార్యక్రమాలు వంటి అంశాలపై నలుగురు ముఖ్య నేతలతో టీడీపీ హైలెవల్ వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం ఆ కమిటీని ప్రకటించారు. అం దు లో టీడీపీ ప్రభుత్వకాలంలో వ్యవసాయశాఖ మంత్రులుగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిలతోపాటు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, నిమ్మల రామానాయుడులు ఉన్నారు.