ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ABN , First Publish Date - 2020-03-15T11:24:02+05:30 IST

మార్కాపురం నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరుగుతున్న ఎన్నికలకు టీడీపీ దూరమని మాజీ ఎమ్మెల్యే

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు

ఎన్నికలకు టీడీపీ దూరం: మాజీ ఎమ్మెల్యే కందుల


మార్కాపురం, మార్చి 14: మార్కాపురం నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు జరుగుతున్న ఎన్నికలకు టీడీపీ దూరమని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక జవహర్‌నగర్‌లోని తే నివాసంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరాచకాలను గత 40 ఏళ్ల కాలంలో ఎవరూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. అధికారపార్టీ నాయకులు టీడీపీ తరఫున పోటీ చేసిన వారిని, నాయకులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు.


గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అప్పుడు కరువు ప్రాంతమైన మార్కాపురంలో పార్టీలకతీతంగా పనులు కేటాయించారన్నారు. అయితే వైసీపీ నాయకులు కక్షబూని టీడీపీ నాయకుల బిల్లులు ఆపివేశారన్నారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు టీడీపీ నాయకులు కొంతమేర ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు, పోలీసులు అధికారపార్టీ నాయకులకు తొత్తులుగా మారారన్నారు. సమావేశంలో టీడీపీ అధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, వైసీపీ నాయకులు తాళ్లపల్లి సత్యనారాయణ, మలిపెద్ది సుబ్రమణ్యం, కొప్పుల శ్రీనివాసులు, జవ్వాజి రామాంజనేయరెడ్డి, రంగారెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-15T11:24:02+05:30 IST