మరోసారి వార్తల్లోకెక్కిన తారా చౌదరి

ABN , First Publish Date - 2020-04-27T02:39:17+05:30 IST

తారా చౌదరి మరోసారి వార్తల్లోకెక్కారు. తన భర్తను పామూరు పోలీసులు అకారణంగా కొట్టారంటూ ఆమె ఆరోపించారు. ఉదయం 8 గంటలకు..

మరోసారి వార్తల్లోకెక్కిన తారా చౌదరి

ప్రకాశం: తారా చౌదరి మరోసారి వార్తల్లోకెక్కారు. తన భర్తను పామూరు పోలీసులు అకారణంగా కొట్టారంటూ ఆమె ఆరోపించారు. ఉదయం 8 గంటలకు సరుకులు, మందులు తెచ్చేందుకు బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను పోలీసులు దుర్భాషలాడి చితకబాదారని ఆమె చెప్పారు. తన భర్తపై నాటుసారా రవాణా కేసు బనాయించారని తారాచౌదరి ఆరోపించారు. ప్రశ్నించిన తనను ఎస్సై జైల్లో వేస్తానంటూ పోలీసులు బెదిరించారని తెలిపారు. ‘‘నా భర్తపై ఎస్సై చంద్రశేఖర్‌ కక్ష పూరితంగా దాడి చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజల ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినందుకే నా భర్తను టార్గెట్‌ చేసి ఎస్సై కేసు పెట్టారు. పామూరు ఎస్సై చంద్రశేఖర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా.’ అని తారా చౌదరి తెలిపారు. 

Updated Date - 2020-04-27T02:39:17+05:30 IST