ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతం
ABN , First Publish Date - 2020-03-02T11:07:11+05:30 IST
ఒంగోలులో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతమైంది. గ్లోబల్ ఎడ్యుకేషనల్ బ్రిడ్జి చెన్నైలోని ఎడ్యుకేషన్ ఓవర్‌సీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫెయిర్‌కు

ఒంగోలు విద్య, మార్చి1 : ఒంగోలులో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతమైంది. గ్లోబల్ ఎడ్యుకేషనల్ బ్రిడ్జి చెన్నైలోని ఎడ్యుకేషన్ ఓవర్‌సీస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫెయిర్‌కు విద్యార్థులనుంచి అపూర్వ స్పం దన లభించింది. జిల్లా నలుమూలలనుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఎడ్యుకేషన్ ఫెయిర్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ దేశాల్లోగల విద్యావకాశాలు , ఉపకారవేతనాలు గురించి నిర్వాహకులు వివరించారు. విదేశాల్లో అడ్మిషన్లు ,స్కాలర్‌షి్‌ఫలపై విద్యార్ధులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లి దండ్రులు మాట్లాడుతూ విదేశీ విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఒంగోలులో సంస్థను ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్లోబల్ ఎడ్యుకేషన్ బ్రిడ్జి నిర్వాహకులు నడిపినేని హరిబాబు మాట్లాడుతూ ఎక్కువ మంది విద్యార్థుల కోరిక మేరకు ఒంగోలులో మేనెల నుంచి ఐలెట్స్ , జీఆర్‌ఈ కోచింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.ఫెయిర్‌లో ఎడ్యుకేషన్ ఓవర్‌సీస్ అకాడమీ డైరెక్టర్ సీజీ బాలాజీ, ఎడ్యూకో సంస్థల సీనియర్ ఆర్‌ఎం. ఎం.లక్ష్మీకాంత్ , చెన్నై ఎడ్యుకేషన్ ఓవర్‌సీస్ అకాడమీ డైరెక్టర్ రమేష్ , పీటీఈ రీజనల్ హెడ్ చిరంజీవి పాల్గొన్నారు.