రాయితీ యంత్రాలు రానట్లేనా?

ABN , First Publish Date - 2020-12-07T05:00:54+05:30 IST

రైతులకు రాయి తీపై ఇచ్చే యంత్రాలు ఈ ఏడాది ఒక రానట్లే! వీటి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఖరీ ఫ్‌కు ముందే ఇవ్వాల్సిన ఉన్నా నేటికీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది.

రాయితీ యంత్రాలు రానట్లేనా?

భరోసా కేంద్రాలకు ఇంకా చేరని వైనం 

ఖరీఫ్‌లో వాటి ఊసే కరువు

రబీ సీజన్‌కు కూడా మొండిచెయ్యి 

ఈ ఏడాదికి ఆశలు వదులుకుంటున్న రైతులు 


ఒంగోలు (జడ్పీ), డిసెంబరు 6 : రైతులకు రాయి తీపై ఇచ్చే యంత్రాలు ఈ ఏడాది ఇక రానట్లే! వీటి విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఖరీ ఫ్‌కు ముందే ఇవ్వాల్సిన ఉన్నా నేటికీ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం అమలు చేసిన వి ధానాన్ని మార్చి గ్రూపులకు ఇవ్వాలని నిర్ణయించి తా త్సారం చేస్తోంది. ఇప్పటి వరకూ వీటి కోసం ఎదురు చూసిన రైతులు ఇక ఆశలు వదులుకుంటున్నారు. 


గత ప్రభుత్వ హయాంలో.. 


రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో వా రికి ఆసరాగా ఉండేందుకు గత టీడీపీ ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందించింది. మినీ ట్రాక్టర్లు, విత్తన గొర్రులు, ఇతర యంత్రాలను వ్యక్తిగ తంగా ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానికి స్వస్తి చెప్పింది.  రైతులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వాటికి అందించాలని నిర్ణయించింది. రబీ సీజన్‌ ప్రారంభమవ డానికి ముందు మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లాలోని 879 రైతు భరోసా కేంద్రాల పరిధిలో  ఒక్కో గ్రూపును ఏర్పాటు చేసి  దాదాపు రూ.15 లక్షల విలు వైన యంత్రాలను సబ్సిడీపై అందిస్తామని ప్రకటించిం ది. యంత్రాల విలువలో 10 శాతాన్ని గ్రూపు సభ్యులు వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. 40 శాతం ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. మిగతా 50 శాతాన్ని బ్యాంకు ద్వా రా రుణంగా ఇప్పిస్తారు. వీటిని రబీ సీజన్‌ ప్రారంభం నాటికి  అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో  ఖరీఫ్‌ సీజన్‌లో పరికరాల కోసం ఇబ్బందిపడిన రైతులు కనీసం రబీకైనా అందుబాటులో కొస్తాయని ఆశించారు. కానీ సర్కారు మాటలన్నీ నీటి మూటలే అయ్యాయి.  ఇప్పటికీ  పరికరాలు రైతు భరో సా కేంద్రాలకు చేరలేదు.


ఆదేశాల కోసం ఎదురుచూపు


సబ్సిడీ యంత్ర పరికరాలను రైతు భరోసా కేంద్రా ల్లో అందుబాటులో ఉంచి నామమాత్రపు అద్దె తీసుకు ని రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు  గ్రూ పులను ఏర్పాటు చేశారు. వారిపేరు మీద బ్యాంకు ఖా తాలు తెరవడం, ఇతర ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశా రు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. రై తులు మాత్రం రబీ సీజన్‌ ప్రారంభమై రెండునెలలు గడిచినా ఇప్పటికీ అందకపోవడంతో యంత్రాల కోసం నానా అగచాట్లు పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ అద్దెకు వాటిని తీసుకువచ్చి ఉపయోగిస్తున్నా మని, ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరి కరాలను తమకు అందే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా రైతులు కోరుతున్నారు.


త్వరలోనే అందుబాటులోకి వస్తాయి


రైతులకు యంత్ర పరికరా లను త్వరలోనే అందుబాటులో కి తెస్తాం. ఇప్పటికే బ్యాంకు ఖా తాలు తెరిచాం. కావాల్సిన యం త్రాలను ఆయా గ్రూపులు ఎం పిక చేసుకుంటున్నాయి. తరు వాత పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయ డం జరుగుతుంది. తదుపరి ప్రక్రియను కూడా పూర్తి చేసి పరికరాలను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతాం.

- శ్రీరామమూర్తి, జేడీఏ


Updated Date - 2020-12-07T05:00:54+05:30 IST