సగిలేరులో ఈతకు వెళ్లి బీటెక్‌ విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2020-11-21T05:52:49+05:30 IST

గిద్దలూరు మండలం నరవ పంచాయతీ పరిధిలోని బయనపల్లె గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థి ముత్తుముల శశికాంత్‌రెడ్డి (20) సరదాగా ఈతకు కొండపేట గ్రామసమీపంలోని సగిలేరుకు వెళ్లాడు.

సగిలేరులో ఈతకు వెళ్లి బీటెక్‌ విద్యార్థి మృతి
సగిలేరులో గాలిస్తున్న గజ ఈతగాళ్లు

గిద్దలూరు టౌన్‌, నవంబరు 20 :  ఈత సరదా ప్రాణం తీసింది. అందిన సమాచారం మేరకు గిద్దలూరు మండలం నరవ పంచాయతీ పరిధిలోని బయనపల్లె గ్రామానికి చెందిన బిటెక్‌ విద్యార్థి ముత్తుముల శశికాంత్‌రెడ్డి (20) సరదాగా ఈతకు కొండపేట గ్రామసమీపంలోని సగిలేరుకు వెళ్లాడు. లోతైన ప్రాంతం కావడంతో శశికాంత్‌రెడ్డి నీటిలో మునిగిపోయాడు. వెంట ఉన్న స్నేహితులు  శశికాంత్‌రెడ్డి కనిపించక పోవడంతోఅధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అగ్నిమాపకదళ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ టీంతో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు గల్లంతైన శశికాంత్‌రెడ్డి ఆచూకి దొరకలేదు. చీకటిపడేసమయంలో శశికాంత్‌రెడ్డి మృతదేహం లభ్యమై మృతిచెందినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. కుమారుడు చేతికి వచ్చే సమయంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Read more