పారిశుధ్యం లోపిస్తే కఠిన చర్యలు

ABN , First Publish Date - 2020-03-25T10:16:12+05:30 IST

గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తప్పవని పంచాయతీ సిబ్బందిని ఎంపీడీవో బి.శ్రీనివాసులు హెచ్చ రించారు.

పారిశుధ్యం లోపిస్తే కఠిన చర్యలు

పీసీపల్లి, మార్చి 24 : గ్రామాల్లో పారిశుధ్యం లోపిస్తే చర్యలు తప్పవని పంచాయతీ సిబ్బందిని ఎంపీడీవో బి.శ్రీనివాసులు హెచ్చ రించారు. మండలంలోని పెద అలవలపాడు గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.  రోడ్లపై, కాలువలు, చేతి పంపులు, ఇంకుడు గుంతల వద్ద నిలిచిన మురుగు ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.


గృహ యజమానులతో పాటు పంచాయతీ సిబ్బందిపై మండిపడ్డారు. ఒక వైపు కరోనా వైరస్‌తో దేశం హడలి పోతుంటే.. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. నివాస ప్రాంతాను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పారిశుధ్య సమస్య తలెత్తితే ఇంటి యజమానులకు అపరాధరుసుం చెల్లించాలన్నారు. అనంతరం గ్రామంలో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లించారు. 

Read more