ఇరువర్గాల ఘర్షణ - పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2020-12-06T06:01:57+05:30 IST

ఇరువర్గాలు ఘర్షణ పడడంతో పలువురికి గాయాలైన ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది.

ఇరువర్గాల ఘర్షణ - పలువురికి గాయాలు

దొనకొండ, డిసెంబరు 5 : ఇరువర్గాలు ఘర్షణ పడడంతో పలువురికి గాయాలైన ఘటన మండలంలోని లక్ష్మీపురం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. దొనకొండ పోలీ్‌సస్టేషన్‌ ఏఎస్సై రంగారావు తెలిపిన వివరాల మేరకు.. చందవరం గ్రామానికి చెందిన ఏ.పోలయ్య, చిన్నరాజయ్యలు వారి గొర్రెలను మేపుకుంటూ లక్ష్మీపురం గ్రామం మీదుగా వెళ్తుంటారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన రావులపల్లి వెంకటేశ్వర్లు వాహనంపై వెళ్తుండగా గొర్రెలను పక్కకు తోలకపోవడంతో ఇద్దరు వాగ్వాదం చేసుకొంటూ ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన వారికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి పంపి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రంగారావు తెలిపారు.


Read more