రామాయపట్నం పోర్టుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-11-19T05:13:39+05:30 IST
రామా యపట్నం ఓడరేవు ఏర్పాటుపై నెలకొన్న గందర గోళ పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రం గారావు డిమాండ్ చేశారు.
ఒంగోలు(కలెక్టరేట్), నవంబరు 18 : రామా యపట్నం ఓడరేవు ఏర్పాటుపై నెలకొన్న గందర గోళ పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రం గారావు డిమాండ్ చేశారు. బుధవారం ఒంగోలు లోని కళ్యాణి కాన్ఫరెన్స్‌హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివిధ సంఘాల నా యకులు చుంచు శేషయ్య, బి.హనుమారెడ్డి, కె. అరుణ, పి.గోవిందయ్య, రఫీఅహ్మద్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు ఏ ర్పాటు విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయని వారు ఆరో పించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మేజర్ పో ర్టు ఏర్పాటు చేయడం వల్ల జిల్లా అభివృద్ధితో పా టు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ద క్కుతాయని చెప్పారు. రామాయపట్నం పోర్టును కొంత భాగం ప్రకాశం, మరికొంత భాగం నెల్లూ రు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. గతంలో వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం 804 ఎకరాలు మాత్రమే రామా యపట్నంలో భూసేకరణ చేస్తున్నందున ప్రభు త్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అభివృద్ధి కోసం ముందుకు వచ్చే వారందరితో క లిసి పనిచేసేందుకు కూడా సిద్ధం ఉన్నామని తె లిపారు. అవసరమైతే మరోసారి పోర్టు ఏర్పాటు కోసం ఉద్యమించడం జరుగుతుందని రంగారావు స్పష్టం చేశారు.