-
-
Home » Andhra Pradesh » Prakasam » sportive sprite is essiencial
-
క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి
ABN , First Publish Date - 2020-12-16T05:24:43+05:30 IST
గ్రామీణ ప్రాంతాలలో క్రీడలపట్ల ప్రతి ఒక్కరూ చొరవ చూపించి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బెల్లంకొండ సాయిబాబా అన్నారు.

రాచర్ల, డిసెంబరు 15 : గ్రామీణ ప్రాంతాలలో క్రీడలపట్ల ప్రతి ఒక్కరూ చొరవ చూపించి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ బెల్లంకొండ సాయిబాబా అన్నారు. ఆకవీడు గ్రామంలో ప్రదీప్ ఆధ్వర్యంలో నియోజకవర్గ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. కార్యక్రమాన్ని సాయిబాబా మంగళవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో పోటీలు నిర్వహించడం వలన క్రీడలపట్ల ఆసక్తి పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు వెంకటేష్, శంకర్‌నాయుడు, రాజా, తదితరులు పాల్గొన్నారు.