కొంటె ఎస్సై.. మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-03T20:36:33+05:30 IST

క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఓ ఎస్సై కట్టుతప్పాడు. మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. వెకిలి మాటలతో మానసికంగా వేధించాడు. ఆమె ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ కు ఫిర్యాదు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒంగోలులోని తాలూకా

కొంటె ఎస్సై.. మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు

ఎస్పీకి ఫిర్యాదు.. విచారించిన ఒంగోలు డీఎస్పీ


ఒంగోలు (క్రైం) : క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఓ ఎస్సై కట్టుతప్పాడు. మహిళా కానిస్టేబుల్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. వెకిలి మాటలతో  మానసికంగా వేధించాడు. ఆమె ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ కు ఫిర్యాదు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఒంగోలులోని తాలూకా పోలీసు స్టేషన్‌కు నెలక్రితం ఓ ఎస్సై వచ్చారు. పది రోజుల క్రితం అదే పోలీసుస్టేషన్‌లో కొత్తగా కొందరు మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో చేరారు. వీరిలో ఓ కానిస్టేబుల్‌ పట్ల ఎస్సై వ్యవహరిస్తున్న తీరు  వివాదాస్పదమైంది. తనను ఎస్సై వేధిస్తున్నాడని, గదిలోకి పిలిపించుకొని అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాలతో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ రంగంలోకి దిగారు. మహిళా కానిస్టేబుళ్లతో మాట్లాడారు. అనంతరం ఎస్సైను కూడా పిలిపించి ఇలాంటి చర్యలు సరికాదని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయమై అధికారికంగా పోలీసు అధికారులు ఎలాంటి సమాచారం చెప్పలేదు. 

Updated Date - 2020-10-03T20:36:33+05:30 IST