53 గొర్రెల అపహరణ

ABN , First Publish Date - 2020-02-08T11:06:19+05:30 IST

మండలంలోని నరసాపురం గ్రామం లో 52 గొర్రెలు అపహరణకు గురయ్యా యి. ఈ మేరకు వాటి యజమాని బొక్కా కొండలరావు శుక్రవారం

53 గొర్రెల అపహరణ

నరసాపురం (గుడ్లూరు), ఫిబ్రవరి 7 : మండలంలోని నరసాపురం గ్రామం లో 53గొర్రెలు అపహరణకు గురయ్యా యి. ఈ మేరకు వాటి యజమాని బొక్కా కొండలరావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు.. కొండలరావు రోజూ మాదిరిగానే బుధ వారం గొర్రెలను పొలం తోలికెళ్లాడు. రాత్రి తన ఇంటికి సమీపంలోని పెదపవని- కావలి రోడ్డులో ఉన్న దొడ్డిలో వాటిని తో లాడు. అనంతరం ఇంటికి వెళ్లి పడుకు న్నాడు.  అదే రోజు రాత్రి 53 గొర్రెలు అప హరణకు గురయ్యాయి. వీటి విలువ రూ. 5లక్షలు ఉంటుందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సై పాండురంగారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-08T11:06:19+05:30 IST